Balapur Laddu Auction 2023: బాలాపూర్ లడ్డూకు మరో సారి రికార్డు ధర పలికింది. ఈ రోజు హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డూను రూ.27 లక్షలకు దక్కించుకున్నారు దాసరి దయానంద్ రెడ్డి (Dasari Dayanand Reddy). దయానంద్ రెడ్డి తుర్కయాంజల్ కు చెందిన రియల్టర్. ఈ వేలం పాటలో మొత్తం 36 మంది పాల్గొన్నారు.
గతేడాది లడ్డూ ధర 24.60 లక్షలు పలికింది. లాస్ట్ టైమ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఈ సారి వేలం పాటలో పాల్గొన్నారు. బాలాపూర్ లడ్డూ మొదటి నుంచి చాలా ఫేమస్. ఇక్కడ లడ్డూను పాడుకోవడానికి పోటీలు పడుతుంటారు. ఈసారి కూడా వేలం మొదలైన దగ్గర నుంచి ఆసక్తి నెలకొల్పింది. మొదటి నుంచే లడ్డూ ధర అరకోటి టచ్ అవుతుందని అంచనా ఉంది. కానీ పాట 27 లక్షల దగ్గరనే ఆగిపోయింది. పాట మొదలైనప్పటి నుంచి ఆసక్తిని రేపింది. మొత్తం 36 మంది ఈ ఆక్షన్ లో పాల్గొన్నారు.
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూకు వేలంలో రికార్డ్ ధర పలికింది. గణేశుడి లడ్డూను ఏకంగా కోటి 26 లక్షలకు పాడుకున్నారు. వేలంలో వచ్చిన మొత్తాన్ని ఛారిటీకే ఉపయోగిస్తానని చెబుతున్నారు లడ్డూను దక్కించుకున్న ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. గణపతి లడ్డూ ఇంత ధర పలకడం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. ఇక మాదాపూర్ మై హోమ్ భూజాలో కూడా గణపతి లడ్డూకు వేలంలో భారీ ధరనే సొంతం చేసుకుంది. ఇక్కడ లడ్డూ 25.50 లక్షలకు సొంతం చేసుకున్నారు అపార్ట్ మెంట్ వాసులు. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వినాయకుడి లడ్డూను సొంతం చేసుకున్నారు.