Movies : గామి సాలిడ్ హిట్.. ఒక్కరోజులో 9.07కోట్లు

శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ గామి సినిమా బాక్సాఫీస్ రికార్డ్‌లను బద్దలు కొడుతోంది. అఘోరా కాన్సెప్ట్‌లో ఒక కొత్త కథతో వచ్చిన విశ్వక్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రిలీజ్ అయిన ఒక్కరోజులోనే గామీ మూవీ 9.07 కోట్ల కలెక్షన్ రాబట్టుకుంది.

Gaami X Review : మెంటల్ మాస్.. విశ్వక్ సేనుడి 'గామి' ట్విటర్ రివ్యూ ఇదే!
New Update

Gaami Movie : మాస్‌ కా దాస్, టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) గామి(Gaami) తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్టీ టాలెంట్‌తో దూసుకు వెళుతున్న విశ్వక్ అఘోర శంకర్ పాత్రలో అదరగొట్టాడు. మానవ స్పర్శను తట్టుకోలేని ఒక కొత్త పాత్రలో నటించాడు. ఈ మూవీలో చాందినీ చౌదరి(Chandini Chowdary) హీరోయిన్‌గా నటించగా... అభినయ(Abhinaya) లీడ్‌ రోల్ చేశారు. విద్యాధర కాగిత ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇతనికి ఇదే మొదటి సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వరల్డ్‌ వైడ్‌గా గామి సినిమా నిన్న విడుదల అయింది.

నాలుగేళ్ళకు పైగా షూటింగ్ జరుపుకున్న గామి మూవీ ట్రైలర్‌తోనే మంచి అభిప్రాయాన్ని తీసుకువచ్చింది. సినిమా కూడా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్సే అధికారికంగా ప్రకటించారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా గామి సినిమా రూ.9.07 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు.ఫస్ట్ డేనే ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేసింది. అలాగే అమెరికాలో కూడా 250K డాలర్స్ పైగా కలెక్ట్ చేసి 1 మిలియన్ డాలర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది గామి.

గామి సినిమా క్రౌడ్ ఫండింగ్‌తో నిర్మించారు. కార్తీక్ శబరీష్ ఈ క్రౌడ్ ఫండింగ్‌ను చేశారు. మొత్తం సినిమాకు రూ. 24 కోట్లు ఖర్చు అయినట్లు టాక్. గామి సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ రూ.3.5 కోట్లు, సీడెడ్ రూ.1.4 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.3.5 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓవర్సీస్ తో కలిపి ఓవరాల్ గా ఈ సినిమాకు రూ.11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Also Read : Railway News : తెలుగు రాష్ట్రాల్లో 18 రైళ్ళకు కొత్త హాల్ట్‌లు

#telugu #vishwak-sen #movies #gaami
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe