Galla Jayadev: రాజకీయాలకు గల్లా గుడ్‌ బై!

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. వ్యాపారాల కోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

New Update
Galla Jayadev: రాజకీయాలకు గల్లా గుడ్‌ బై!

Galla Jayadev: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) ఈరోజు రాజకీయాలకు (Politics) గుడ్‌ బై చెప్పనున్నారు. ఈ క్రమంలోనే ఆయన మీడియా సమావేశం (Media Meeting) ఏర్పాటు చేసి తాను రాజకీయాలకు ఎందుకు దూరం అవుతున్నాను అనే విషయాలను వెల్లడించారు. కేవలం వ్యాపారాల (Business) కోసమే రాజకీయాలను(Politics)  విడిచిపెడుతున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీకి వీడ్కోలు చెప్పడం లేదని స్పష్టం చేశారు.

తాతకు 55 ఏళ్ల రాజకీయ చరిత్ర..

అంతేకానీ రాజకీయ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే జయదేవ్‌ 2024 ఎన్నికల్లో (2024 Elections) పోటీ చేయనని తెలిపాడు. తన కుటుంబం రాజకీయాల్లో ఉందని తన తాతకు 55 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. తన తల్లి కూడా రాజకీయాల్లో మంచి నాయకురాలిగా ఉన్నారు.

ఎంపీగా నా వంతు కార్యక్రమాలు..

నేను ప్రజలకు సేవ చేసేందుకు అమెరికా నుంచి తిరిగి వచ్చాను. కానీ చాలా మంది రాజకీయాల్లో మమ్మల్ని అణగదొక్కలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ఎంపీగా నా వంతు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానని ఆయన వివరించారు. పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై లేవనెత్తుతున్నా అని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను సాధించేందుకు పోరాటం చేశాను.అమరావతికి రాజధాని కోసం చాలా ప్రయత్నం చేశాను.
కృష్ణా నది సమీపంలో రాజధాని కట్టాలని మొట్ట మొదట సూచించాను.అమరావతి ప్లానింగ్ కమిటీ సభ్యుడుగా ఉన్నాను.పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాల్సి ఉంటుందని గమనించాను అంటూ జయదేవ్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడితే..

రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడితే ఈడీ విచారణకు పిలిచింది. మా కంపెనీలన్నీ చట్టం ప్రకారమే నడుస్తాయి.అమర్ రాజా కంపెనీలు న్యాయ పోరాటం చేశాయి. రాజకీయాల్లో నిజాయితీ బలహీనంగా మారిపోయింది.కోర్టు కేసులన్నింటి నుండి క్లిన్ చిట్ వస్తుంది అంటూ జయదేవ్‌ పేర్కొన్నారు.

ఇప్పుడు చాలా మంది రాజకీయాలు ఉన్న కూడా వ్యాపారాలు ఇతర వృత్తులు కొనసాగిస్తున్నారు. నేను కూడా అలానే వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాల్లో సేవ చేశాను. రాజకీయాలకు ముందు వ్యాపార అనుభవం ఉందని జయదేవ్‌ వివరించారు.మా కంపెనీలన్నీ చిత్తూరులోనే ఉండటంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి.దీంతో తెలంగాణ, తమిళనాడుతో పాటు విదేశాల్లో కూడా మా కంపెనీని విస్తరిస్తున్నాను.ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాను.రాజకీయాలు ఒకసారి వదిలేస్తే తిరిగి రావటం కష్టమని అంటున్నారు. రాష్ట్రం టార్గెట్ చేసినా నిలబడ్డాను.తిరిగి వస్తే పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా వస్తాను.రాముడు, పాండవుల వనవాసం తర్వాత చాలా బలంగా వచ్చారు అంటూ జయదేవ్‌ స్పష్టం చేశారు.

ఆత్మీయ విందు..

తనను రెండుసార్లు గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని జయదేవ్‌ ఆదివారం ఏర్పాటు చేశారు.రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తరువాత జయదేవ్‌ ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌ లో ఈ విందును ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Also read: చనిపోయాడనుకుంటే ఫోన్‌ చేశాడు..ఉలిక్కిపడ్డ బంధువులు, పోలీసులు!

Advertisment
తాజా కథనాలు