TS Elections: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్ష పదవికి గాలి అనిల్ కుమార్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

TS Elections: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!
New Update

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి గాలి అనిల్ కుమార్ రాజీనామా చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు గాలి అనిల్. నర్సపూర్ టికెట్ ను ఆవుల రాజిరెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న అనిల్ కుమార్  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.

ALSO READ: నామినేషన్ ఉపసంహరించుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. అధిష్టానం ఆ హామీ ఇచ్చిందని ప్రకటన!

publive-image

తన రాజీనామా లేఖను మల్లిఖార్జున ఖర్గేకు పంపారు. లేఖలో.. "ఇటీవలి కాలంలో నా విషయంలో జరిగిన పరిణామాలు నా అభిమానులను, కార్యకర్యలను తీవ్రంగా కలిచివేశాయి. పార్టీ నాతో వ్యవహారించిన తీరు వల్ల వారి మనోభావాలు దెబ్బతిన్నాయని పెద్ద సంఖ్యలో నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేసిన వారికి పార్టీలో సరైన గౌరవం ప్రాథమ్యం దక్కడం లేదు. నేను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయాను. కార్యకర్తల, అభిమానుల వత్తిడి మేరకు వారి మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూన్నాను. దయచేసి నా రాజీనాను అంగీకరించగలరు." అని రాసుకొచ్చారు.

ALSO READ: రైతుల ఖాతాల్లో డబ్బులు.. మీకు అందాయా? లేకపోతే ఇలా చేయండి 

publive-image

#telangana-news #telangana-elections #congress-party-shock
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe