Gaddam Prasad: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‎గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్‌..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‎గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఈయన్ని ఎన్నుకోనుంది. అయితే దీనికి బీఆర్‌ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావుతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు.

New Update
Telangana: స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‎గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఈయన్ని ఎన్నుకోనుంది. అయితే దీనికి బీఆర్‌ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. గడ్డం ప్రసాద్ ప్రసాద్ తన నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావుతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. గడ్డం ప్రసాద్ తెలంగాణకు తొలి దళిత స్పీకర్‌ కానున్నారు. ప్రసాద్‌కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై మాజీ మంత్రి కేటీఆర్‌ సంతకం చేశారు. ఇక గురువారం ఉదయం శాసనసభలో స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

Also read: ధరణిలో లోపాలు.. రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే

Advertisment
Advertisment
తాజా కథనాలు