BREAKING: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

BREAKING: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌
New Update

Telangana Legislative Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. నేటితో నామినేషన్లకు గడువు ముగిసింది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ (Gaddam Prasad Kumar) నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు సభలో స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు.

ALSO READ: పార్లమెంట్ లో దాడి.. లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం!

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

ధరణి పోర్టల్ పై (Dharani Portal) సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Bhatti Vikramarka), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), రాజనర్సింహా (Rajanarsimha), అధికారులు హాజరయ్యారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నెలకు ఒకసారి మండల కేంద్రం రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంన్నారు. ఎన్నికల్లో ధరణి రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

ALSO READ: BREAKING: భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్

#telangana-news #cm-revanth-reddy #gaddam-prasad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe