Mega Job Mela: తెలంగాణలో మరో భారీ జాబ్ మేళా...65పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..!!

నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీన 65కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

New Update
Mega Job Mela: తెలంగాణలో మరో భారీ జాబ్ మేళా...65పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..!!

Mega Job Mela: నల్లగొండలోని నిరుద్యోగులకు శుభవార్త. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఫిబ్రవరి 25న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడించారు. 65కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.TASKఆధ్వర్యంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నకిరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్ మెంట్ సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 7వ తరగతి, పదవ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ, హోటల్ మేనేజ్ మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎ, బీఎస్సీ, బీకామ్, ఎంసీఎ, ఎంబీఎ, ఎంబీఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు తమ సీవీ, అర్హత సంబంధించిన డాక్యుమెంట్స్ ను తీసుకుని రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం రిక్వెస్ట్ చేశారు.18 నుంచి 35ఏళ్ల లోపు ఉన్న యువతీయవకులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు.

publive-image

పూర్తి వివరాల కోసం 7097655912, 9030047303, 9642333668 హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ కాల్ చేయవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  వందకు పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..నల్లగొండలో మెగా జాబ్ మేళా..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు