Summer Season : వేసవి కాలం వచ్చేసింది. ఎండలు(Sun) మండిపోతున్నాయి. ఇక ఇంత వేడి(Heat) లో బయటకు వెళ్లడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా చాలా మంది డీహైడ్రేషన్(Dehydration) సమస్యకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోయి నీరసం, కళ్ళు తిరగడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. అయితే వేసవిలో ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండడానికి ఈ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము.
Also Read : Keerthi Bhat: బిగ్‌బాస్ బ్యూటీకి అర్థరాత్రి మెసేజ్.. క్లిక్ చేయగానే రూ.2లక్షలు ఫసక్.. ఏం జరిగిందంటే?
పుచ్చకాయ
వేసవి కాలంలో పుచ్చకాయ(Watermelon) సరైన ఎంపిక. దీనిలోని 92 శాతం నీరు శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతే కాదు ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి.
కీరదోస
సహజంగానే కీరదోస(Cucumber) లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మండే ఎండల్లో వీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను తగ్గడానికి సహాయపడతాయి. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఇవి అద్భుతమైన చిట్కా.
ఖర్భూజ
ఖర్భూజ(Cucurbita Maxima) లో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. దీని మొత్తం బరువులో 90% నీళ్ళే ఉంటాయి. అందుకని వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఈ పండును తీసుకోవడం మంచింది.
కొబ్బరి నీళ్లు
వేసవిలో ఇవి చాలా ముఖ్యమైనవి అని చెప్పొచ్చు. కొబ్బరి నీళ్ల(Coconut Water) లో మినరల్స్, విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచి ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
పప్పాయ
పప్పాయ(Papaya).. క్యాల్షియం, మాంగనీస్ , పొటాషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ పండులోని 87 శాతం నీరు శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ సి రోగనిోధకశక్తిని కూడా పెంచుతుంది.
స్ట్రా బెర్రీ
స్ట్రా బెర్రీ(Strawberry) లోని అధిక నీటి శాతం డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది. అలాగే దీనిలోని ఫైబర్, యాంటి ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్ c శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : Re-Heating Oil: వంట నూనెను అదే పనిగా వేడి చేస్తున్నారా..? మీ ఆరోగ్యం అస్సామే..!