Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఇవాళ్టి నుంచి అకౌంట్లలోకి రైతుబంధు

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకే జమ అయిన డబ్బులు ఇప్పుడు అందరి ఖాతాల్లోకి రానున్నాయి. ఇవాల్టి నుంచే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని రేవంత్ సర్కార్ చెబుతోంది.

Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఇవాళ్టి నుంచి అకౌంట్లలోకి రైతుబంధు
New Update

Thummala Nageswara Rao : తెలంగాణ(Telangana) రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈరోజు నుంచి రైతుబంధు(Rythu Bandhu) అకౌంట్లలోకి జమ అవుతుందని ప్రకటించింది. రాష్ట్రంలో రబీ పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని... 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.

సోమవారం నుండి అధిక సంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు. ఈ అంశంపై సంక్రాంతి(Sankranti) తర్వాత మరో మారు సమీక్ష నిర్వహిస్తామన్నారు. రైతుల సంక్షేమం , వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని , గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయడానికి కట్టుబడి ఉందని తుమ్మల తెలిపారు.

Also read:టీడీపీకి కేశినేని నాని మరోషాక్‌.. కార్పొరేటర్ పదవికి కుమార్తే రాజీనామా!

గత ప్రభుత్వం వానాకాలంలో రైతుబంధు డబ్బులను జమ చేసింది. ఇప్పుడు వేసవి కాలం పంటల పెట్టుబడుల్లో భాగంగా నిధులను విడుదల చేయనుంది. దీని కోసం జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులు కాగా ప్రతి సీజన్‌లో ప్రభుత్వం రూ.624,14,84,629 వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు దశల వారీగా జిల్లాల వ్యాప్తంగా మిగిలిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. జనవరి నెలాఖురులోగా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం భావిస్తోంది.

గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్(Rythu Bandhu Scheme) ను తీసుకొచ్చింది. ఎకరానికి రూ. 5వేలను జమ చేసింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా... కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది.  కానీ కొత్తగా ఎలాంటి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో.. ఈ యాసంగికి మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే పచ్చజెండా ఊపారు. కానీ కొత్తగా ఎలాంటి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో.. ఈ యాసంగికి మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే పచ్చజెండా ఊపారు. ఈ విడత పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో సమీక్షించి పథకంలో మార్పులు, చేర్పులు, చేసే అవకాశం ఉంది.

#telangana #thummala-nageswara-rao #formers #rythubandhu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe