BRS Fire : ఆ సమయంలో రైతుబంధు విడుదల ఆపాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ.. భగ్గుమన్న బీఆర్ఎస్..!!
ఎన్నికల సమయంలో రైతు బంధు నిధుల విడుదల ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడాన్ని..బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ రైతులకు ద్రోహం చేసేలా కాంగ్రెస్ మరో కుట్రకు తెరలేపిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అడ్డుకునే కుట్ర చేస్తుందంటూ ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ రైతు విద్రోహ చర్యలపై అన్నదాతలు సైతం మండిపడుతున్నారని బీఆర్ఎస్ అంటోంది. రైతుబంధుపై కాంగ్రెస్ అక్కసును తీవ్రంగా ఖండించింది. రైతులంగా కేసీఆర్ వెంట ఉన్నారన్న కారణంతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీకి కాంగ్రెస్ రాసిన లేఖపై మండిపడుతూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ప్రకటన విడుదల చేశారు.