Telangana: రేవంత్ పేరిట రెండు అరుదైన రికార్డ్స్.. తెలంగాణ పొలికల్ హిస్టరీలో సుస్థిరం..

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. మంత్రిగా కాకుండానే.. నేరుగా సీఎం అయిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ఒక్కరే ఎలాంటి పరిపాలనా అనుభవం లేకుండానే సీఎం అయ్యారు. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ సీఎం అయ్యారు.

Telangana: రేవంత్ పేరిట రెండు అరుదైన రికార్డ్స్.. తెలంగాణ పొలికల్ హిస్టరీలో సుస్థిరం..
New Update

Telangana CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇప్పుడొక సంచలనంగా మారారు. అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఎలాంటి పాలనా అనుభవం లేకుండానే ఆయన నేరుగా సీఎం అయ్యారు. ఇప్పుడితే హాట్ డిస్కషన్‌గా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేగా మాత్రమే పని చేసిన అనుభవం ఉంది. మంత్రిగా ఆయన పని చేసిన అనుభవం లేదు. అయినప్పటికీ.. ఆయన శక్తియుక్తులను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లెందరినో కాదని రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది. అయితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కాకుండానే నేరుగా సీఎం అయిన తొలి వ్యక్తిగా రేవంత్ రెడ్డి చరిత్రకెక్కనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నందమూరి తారక రామారావు పెను సృష్టించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆయన విజయం సాధించి.. ఎలాంటి రాజకీయ, పాలనా అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. సినిమాల్లో కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్.. నాటి ముఖ్యమంత్రి టి. అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించిన తీరుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తనదైన శైలిలో ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుని ఎన్నికల్లో గెలిచారు. నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా అనుభవం లేకుండానే సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ విప్‌గా, శాసనసభ స్పీకర్‌గా పని చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రోశయ్యను సీఎంగా నియమించింది కాంగ్రెస్. అయితే, వయోభారం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో పరిస్థితి ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం.. నాటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది.


2014 తరువాత ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించబడింది. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పాటయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయితే.. ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే, రెండవ టర్మ్‌లో ఏపీకి సీఎం అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండానే సీఎం అయ్యారు. వైఎస్ఆర్ హయాంలో ఎంపీగా గెలిచారు జగన్. ఆ తరువాత 2014 ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన స్థాపించిన వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. దాంతో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో జరిగి ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లతో వైసీపీ గెలుపొందింది. దాంతో ఏపీకి జగన్ సీఎం అయ్యారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. తెలంగాణకు ఇది మూడవ అసెంబ్లీ ఎన్నిక. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీని విజయతీరాలకు చేర్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో ఆయన తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, రేవంత్ 2009 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా మాత్రమే పని చేశారు. మంత్రిగా ఆయనకు ఎలాంటి అనుభవం లేదు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. అయితే, రేవంత్ పేరిట మరో రికార్డ్ కూడా నెలకొనుంది. కాంగ్రెస్ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తిగా కూడా రేవంత్ నిలిచారు.ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రేవంత్ పేరు నిలిచిపోనుంది. అ

Also Read:

తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్!

రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..

#telangana-news #revanth-reddy #telangana-cm-revanth-reddy #telangana-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe