Manipur : మణిపూర్‌లో మళ్ళీ కాల్పులు..నలుగురు అదృశ్యం..రాహుల్ న్యాయ యాత్ర డౌటే.. మణిపూర్‌లో మళ్ళీ అల్లర్లు జరిగాయి. నలుగురు అదృశ్యమయ్యారు. దీంతో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన జరిగింది. By Manogna alamuru 11 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Manipur Riots : నిన్న మణిపూర్(Manipur) లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య గొడవ జరిగింది. దాని తర్వాత కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యం అయ్యారు. ఆ తరువాత వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. Also read:నేడే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్.. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే! జనవరి 1వ తేదీన కూడా... అంతకు ముందు మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన వెలుగు చూసింది. సోమవారం సాయంత్రం తౌబాల్ జిల్లా (Thoubal District)లో ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. ఐదుగురు గాయపడ్డారు. దీంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. అయితే దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. లిలాంగ్ చింగ్జావో (Lilong Qingzhao) ప్రాంతంలో స్థానిక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడి అనంతరం ఆగ్రహించిన స్థానికులు మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన తర్వాత తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించినట్లు ఆయన తెలిపారు. గతేడాది మేలో, మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలో నివసిస్తున్న మెజారిటీ మెయిటీ(Majority Meitei), కొండ ప్రాంతాలలో నివసించే కుకీ కమ్యూనిటీల మధ్య జాతి హింస చెలరేగింది.అప్పటి నుంచి మణిపూర్‌లో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. రాహుల్ న్యాయ్ యాత్ర అనుమతి... ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర జరిగే సూచనలు కనిపించడం లేదు. ఈనెల 14వ తేదీ మణిపూర్ నుంచి ప్రారంభించాలనుకున్న రాహుల్ యాత్రకు అనుమతి లేనట్టేనని సమాచారం. రాహుల్ యాత్రకు అనుమతి అంశంలో పరిశీలనలో ఉంది. ఈ విషయంపై వివిధ భద్రతా సంస్థల నుండి నివేదికలు తీసుకుంటున్నాము. వారి నుండి నివేదికలు అందిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తాజా ఘటనలతో దాదాపుగా న్యాయ్ యాత్రకు అనుమతి అవకాశాలు లేనట్టేనని తెలుస్తోంది. #missing #manipur #gun-firing #riots మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి