Health Tips: డయాబెటీస్ లేకున్నా తరుచుగా మూత్రానికి వెళ్తున్నారా..?

డయాబెటీస్‌ లేకపోయిన కొందరు మాటిమాటికి మూత్రానికి వెళ్తుంటారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే కిడ్నీ సమస్యగా అనుమానించాలి. ముఖం, కాళ్లు, పాదాల ఉబ్బడం, తీవ్రమైన అలసట, చర్మం దురదలు పెట్టడం, నోటి దుర్వాసన వంటి లక్షణాలు వస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.

New Update
Health Tips: డయాబెటీస్ లేకున్నా తరుచుగా మూత్రానికి వెళ్తున్నారా..?

చాలామంది డయాబెటీస్‌తో బాధపడేవారు సహజంగా మాటిమాటికి మూత్రానికి వెళ్తుంటారు. అయితే కొందరికి డయాబెటీస్ లేకపోయినా కూడా మాటిమాటికి మూత్రం వెళ్తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ముఖం అంతా వాపులకు గురై ఉబ్బిపోతుంది. అలాగే కాలి మడమలు, కాళ్లు, పాదాలు, చేతులు కూడా ఉబ్బిపోయినట్లు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట వస్తుంది. రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. చర్మం పొడిగా మారి దురదలు పెట్టడం, నోటి దుర్వాసన రావడం వంటి లక్షణాలు ఉంటాయి.

Also Read: రాత్రి సమయంలో లోదుస్తులు ధరిస్తున్నారా? కష్టాలు తప్పవు 

అంతేకాదు కిడ్నీ సమస్య ఉంటే జ్ఞాపక శక్తి తగ్గడం, తల తిరిగినట్లు అనిపిస్తుంది. వెన్ను నొప్పి రావడం, వాంతి వచ్చినట్లు అలాగే వికారంగా కూడా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కిడ్ని సమస్యలు ఉన్నవారు వేడి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా చలిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులు వాడాల్సి ఉంటుంది. మరో విషయం ఏంటంటే కిడ్నీలు కూడా మన శరీరానికి ముఖ్యమైన అవయవాలు. కాబట్టి వీటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇందుకోసం కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తినాలి. వీటికి సంబంధించి వైద్యుల సూచనలు తీసుకుంటే మంచింది.

Also Read: జలుబు చేసినప్పుడు తినాల్సిన పండ్లు ఇవే

Advertisment
తాజా కథనాలు