VC Sajjanar : అబ్బాయిలూ... మీక్కూడా స్పెషల్ బస్సులు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు! మహిళల సంఖ్య ఎక్కువ ఉంటే ... ఆ రూట్లో పురుషులకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక రేపటి(డిసెంబర్ 9) నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవనుంది. By Trinath 08 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి VC Sajjanar Key Comments to Boys : కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఆర్టీసీ(TSRTC) కి చెందిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. సీఎం ఆదేశాల మేరకు రేపు(డిసెంబర్ 9) మధ్యాహ్నం 1:30 నిమిషాలకు అసెంబ్లీలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్(Sajjanar). మంత్రులు ప్రజాప్రతినిధులతో పాటు బాక్సర్ నిక్కత్ జరిన్ పాల్గొంటారని చెప్పారు. ఇది ఒక్క హిస్టారికల్ డిసిషన్ అని కొనియాడారు. ఈ నిర్ణయం వల్ల ప్రజా రవాణాకు ఆదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వాహనాలతో యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ స్కీమ్‌తో మహిళలకు భద్రత కూడా ఉంటుందని చెప్పారు. సజ్జనార్ ఇంకేం అన్నారంటే: --> ఈ స్కీమ్ పల్లె వెలుగుతో పాటు.. ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్‌లో వయసుతో పరిమితం లేకుండా ప్రయాణం చేయవచ్చు. --> ట్రావెల్ సమయంలో ఏదైనా ఐడీ కార్డ్ చూపించాలి. --> ఐడీ కార్డు చూపిస్తే జీరో టికెట్ ఇష్యూ చేస్తారు --> రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి అయిన ప్రయాణం చేయొచ్చు --> దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రెండు మూడు రోజుల్లో వస్తాయి. ఆదాయం తగ్గుతుంది: ఈ ఉదయం జూమ్ మీటింగ్ నిర్వహించి స్టాప్ అందరికీ సూచనలు తెలియజేశామన్నారు సజ్జనార్. బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ స్కీమ్ లో బాగంగా 7,292 బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీకి ఈ స్కీమ్‌తో ఏడాదికి 3వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజు వారి ఆర్టీసీ అదయం 14కోట్లు ఉండగా.. ఇది 7,కోట్లకు తగ్గే అవకాశం ఉంది. వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం తెలిపారని సజ్జనార్ చెప్పారు. వచ్చే రోజుల్లో కొత్త బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. సజ్జనార్ కీ పాయింట్స్: --> రోజుకి 45 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంది --> కర్ణాటక పరిస్థితి ఇక్కడ రాకపోవచ్చు. --> కర్ణాటకకి ఇక్కడికి చాలా తేడా ఉంది --> అక్కడున్న బస్సులకు ఇక్కడికి డిఫరెన్స్ ఎక్కువ --> ప్యాకేజీ సర్వీస్ కి ఇది వర్తించదు --> ఛార్జీలు పెంచే అవకాశం లేదు --> ప్రభుత్వం నుంచి కొన్ని బకాయిలు రావాల్సి ఉంది. అవి కూడా రిలీజ్ అవుతాయి --> నిన్న సీఎం దృష్టికి విలీన అంశం తీసుకెళ్ళము --> మహిళల సంఖ్య ఎక్కువ ఉంటే ... ఆ రూట్లో పురుషులకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెస్తాం. Also Read: రేపటి నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. అవి ఉండాల్సిందే! WATCH: #tsrtc #sajjanar #vc-sajjanar #free-buses మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి