Hyderabad: వేసవి మొదలైంది..పిల్లల శిక్షణా శిబిరాలు తెరుచుకున్నాయి

వేసవి కాలం మొదలైంది. పిల్లలకు పరీక్షలు అయిపోయాయి. చదువులు పక్కనపెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి టైమ్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనుంది.

New Update
Hyderabad: వేసవి మొదలైంది..పిల్లల శిక్షణా శిబిరాలు తెరుచుకున్నాయి

HCA summer Cricket Coaching camps: వేసవి కాలంలో పిల్లలు ఆటల ఫోకస్ పెరిగేందుకు హెచ్‌సీఏ ప్రయత్నిస్తోంది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనుంది. నగరంలో మొత్తం 5 కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో చిన్నారులకు నెలరోజుల పాటూ ఉచితంగా క్రికెట్‌లో శిక్షణ ఇస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శపల్లి జగన్‌ మోహన్‌రావు తెలిపారు. ఒక్కో శిబిరంలో 80 నుంచి 90 మంఇ వరకు పిల్లలకు ఉచితంగా క్రికెట్ నేర్పిస్తామని చెప్పారు.

బాలురకు అండర్, 14, 16, 18 విభాగాల్లో...బాలికలకు 15, 19 వయో విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. క్రికెట్ అంటే ఇష్టమున్న వాళ్ళందరూ జాయిన్ అవ్వొచ్చని తెలిపారు. ఇంతకు ముందే ఆడే నైపుణ్యం ఉన్న వాళ్ళ/ కూడా వీటిల్లో జాయిన్ మరింత తమ ఆటను మెరుగుపర్చుకోవచ్చని వివరించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15 నుంచి 18 తేదీలోపు అన్‌లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో జింఖానా; మొబైల్: 90301 30346, ఫలక్‌నామా; మొబైల్: 98852 95387, అంబర్‌పేట్‌ ; మొబైల్:98665 82836, లాలాపేట; మొబైల్:99664 62667, మాదాపూర్; మొబైల్:80195 35679 శిబిరాలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్ http://www.hycricket.org ను సందర్శించి తెలుసుకోవచ్చును.

Also Read: Ambedkar: బౌద్ధమతాన్ని విశ్వసించిన అంబేద్కర్..22 ప్రతిజ్ఞలు

Advertisment
Advertisment
తాజా కథనాలు