Free Bus : ప్రతి సంవత్సరం శబరిమలకు(Sabarimala) వచ్చే అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఫ్రీ బస్సు జర్నీ(Free Bus) సౌకర్యం కల్పించాలంటూ విశ్వహిందూ పరిషత్(VHP) సుప్రీంకోర్టులో(Supreme Court) వేసిన పిటిషన్ పై విచారణ మొదలైంది. ఈమేరకు గురువారం దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. కేరళ(Kerala) ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
స్పందన ఏమిటి..
ఈ మేరకు ఉచిత బస్సు అంశంపై తన స్పందన ఏమిటో తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్(Justice KV Viswanathan) తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి పిటిషన్‌ను దాఖలు చేయగా.. కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న బస్సులు సరిపోవడం లేదని, దీంతో భక్తులు అధిక సమయం నిరీక్షించాల్సి వస్తోందని వీహెచ్‌పీ వాదిస్తోంది. అందువల్ల ఉచితంగా బస్సులు నడపటానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి : Crime: కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష.. కేరళ కోర్టు సంచలన తీర్పు
పంబ వరకు..
అయితే వీహెచ్‌పీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ వి చితంబరేశ్.. భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు. నీలక్కల్-పంబా మార్గమంలో కాదా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఈ మార్గాన్ని దేవస్వం నిర్వహిస్తోందని, తమ పథకం ఆ మార్గంలో కాదని సీనియర్ న్యాయవాది తెలిపారు. శబరిమల దిగువన ఉన్న పంబ వరకు యాత్రికులను ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేందుకు అనుమతించామని చెప్పారు.
4కి.మీ. నడుచుకుంటూ..
‘కొండల మీదుగా మరో 4కి.మీ. నడుచుకుంటూ అయ్యప్ప సన్నిధానానికి చేరుకోవచ్చు. అయితే కోవిడ్ కారణంగా నీలక్కల్ వద్ద పంబకు 22 కి.మీ ముందే ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. నీలక్కల్ నుంచి పంబకు వెళ్లేందుకు యాత్రికులు కేఎస్‌ఆర్‌టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. కేఎస్ఆర్టీసీ ఛార్జీలు, పండుగ ఛార్జీలను భారీగా వసూలు చేస్తోంది. నీలక్కల్‌లోని డిపోలో యాత్రికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ సీజన్‌లో కొండపైకి వెళ్లే మార్గంలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది’ అని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Also Read : IND vs ENG: భారత్ భారీ స్కోరు.. రెండో రోజు 175 పరుగుల ఆధిక్యం