TS : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వనపట్లలో భారీవర్షానికి మట్టిమిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తల్లి గొడుగు పద్మ, ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన తండ్రి భాస్కర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

New Update
TS : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!

Nagar Kurnool :భారీవర్షానికి (Heavy Rain) మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన తెలంగాణ (Telangana) లోని నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వనపట్లలో భారీవర్షానికి మట్టిమిద్దె కూలింది. దీంతో ఇంట్లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు.

Also Read: బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. 10 మంది అరెస్టు

తల్లి గొడుగు పద్మ, ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కి ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్‌కు సైతం తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గాయలైన భాస్కర్ ను హుటాహుటిన నాగర్‌కర్నూలు ప్రభుత్వాసుపత్రికి (Government Hospital) తరలించారు.

Advertisment
తాజా కథనాలు