Russia : రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత విద్యార్ధులు మృతి

రష్యాలో నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి చెందారు. సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరలోని నదిలో ఐదుగురు విద్యార్ధులు మునిగిపోగా అందులో ఒకరిని స్థానికులు కాపాడగలిగారు. మిగతావారు పూర్తిగా మునిగిపోవడంతో కాపాడ్డం కష్టమైంది.

New Update
Russia : రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత విద్యార్ధులు మృతి

Russia : రష్యాలో ఓ నది నలుగురు విద్యార్ధులను ఒకేసారి పొట్టన పెట్టుకుంది. వీరందరూ 18-20 ఏళ్ళ మధ్యలో ఉన్నవారే. వీరు నొవ్‌గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీ (State University) లో చదువుకుంటున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరలో ఉన్న వోల్ఖోవ్ నది ఒడ్డున నిలబడి ఉన్న భారతీయ విద్యార్ధిని (Indian Student) అదుపుతప్పి నీటిలో పడిపోయింది. బయటకు రాలేకపోయింది. దీంతో ఆమెను రక్షించేందుకు స్నేహితులు మిగతావారు నీటిలో దూకారు. అయితే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో మిగతావారు కూడా నదిలో మునిగిపోయారు. ఇందులో ఒకరు స్థానికలు కష్టపడి కాపాడగలిగారు. కానీ మిగతా నలుగురు మాత్రం నీటిల లోతుకు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. నది నుంచి బటయపడిన యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

విద్యార్ధులు చనిపోయిన విషయాన్ని సెయింట్ పీటర్స్‌బరగ్‌ (Saint Petersburg) లో ఉన్న ఇండియన్ మిషన్ ఎక్స్‌ (X) లో పోస్ట్ చేసింది. మృతల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని రాసింది. వీలైనంత త్వరగా మృత దేహాలను బంధువులకు పంపడానికి వెలికి నొవ్‌గోరోడ్ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు కాన్సులేట్ జనరల్ తెలిపారు. మృతుల కుటుంబాలను సంప్రదించి, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బయటపడ్డ విద్యార్ధి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని..అతనికి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. చనిపోయిన విద్యార్ధులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: Hyderabad : హైదరాబాద్‌లో కొత్త మోసం..అమ్మాయిలతో డేటింగ్ స్కాం

Advertisment
తాజా కథనాలు