/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/GORRELA-SCAM-jpg.webp)
Gorrela Pampini Scam Case : గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం యాదవ సోదరుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ(Gorrela Pampini) పథకంలో అవకతవకలు జరిగినట్లు ఇటీవల కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ కేసును తెలంగాణ(Telangana) ఏసీబీ సీరియస్ గా తీసుకుంది. ఈ స్కాంలో ఉన్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా పశుసంవర్ధక శాఖ లోని నలుగురు అధికారాలు అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ఆదిత్య కేశవ సాయి లని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల పంపిణీ లో ఈ నలుగురు అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచి రూ.2.10 కోట్లు నొక్కేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరిని అదులోపు తీసుకొని మిగితా సమాచారాన్ని లాగుతున్నారు.
Also Read : Mega DSC : వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ?
గొర్రెల పంపిణీ స్కాంలో నలుగురు అరెస్ట్
పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. గొర్రెల పంపిణీలో 2.10 కోట్ల స్కాం
పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ… pic.twitter.com/NwV35eqKR4
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2024
Follow Us