Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల వేడి.. కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో రాజకీయ వేడి నెలకొంది. తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కార్యక్రమాలను కార్యక్రమాలను చూసుకునేందుకు నలుగురు ఏఐసీసీ సెక్రటరీలను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓ ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది.

Telangana: కాంగ్రెస్‌ ఫైనల్‌ లిస్ట్‌? జాబితాలో 17 మంది పేర్లు.. పలువురి పేర్లు మిస్సింగ్‌!
New Update

మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాలతో దూకుడు పెంచేశాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మొత్తంగా చూసుకుంటే.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల్లో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. ఇదిలాఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. రెండో జాబితాను త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అయితే ఈ తుది జాబితాపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బుధ వారం జరిగిన కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ సిద్ధం చేసినటువంటి జాబితాకు కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఆమోదం తెలపనుంది.

ఇదిలాఉండగా కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కార్యక్రమాలను చూసుకునేందుకు నలుగురు ఏఐసీసీ సెక్రటరీలను కేటాయించింది. తెలంగాణకు బీఎం సందీప్, ఛత్తీస్‌గఢ్‌కు సిరివెల్ల ప్రసాద్‌ లను కేటాయించింది. అలాగే మధ్యప్రదేశ్‌కు రామకృష్ణ ఓజ్హా, రాజస్థాన్‌కు ఉషా నాయుడును కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓ ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది.

#congress #aicc #assembly-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe