Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య బుష్ర బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తోషఖానా అనే కేసులో పాకిస్థాన్‌ కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. నిన్ననే (మంగళవారం) పాక్ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష
New Update

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య బుష్ర బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తోషాకానా అనే కేసులో పాకిస్థాన్ కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. అంతేకాదు ఈ దంపతులు మరో 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా తీర్పునిచ్చింది. అలాగే 787 మిలియన్ల పాకిస్థాన్‌ రూపాయలు జరిమానా విధించింది.

Also Read: నన్ను ఒక సెక్సిస్ట్ గా చూశారు.. భారత చెస్‌ ప్లేయర్‌

ఇమ్రాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

అయితే నిన్ననే (మంగళవారం) పాక్ కోర్టు.. అధికారిక రహస్యాలు బయటపెట్టారనే కారణంతో ఇమ్రాన్‌ ఖాన్‌కు కూడా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు షా మెహమూద్ ఖురేషీకి కూడా ‘సైఫర్’ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికల జరగనున్న వేళ.. మాజీ ప్రధాని, ఆయన భార్యకు జైలు శిక్ష పడటంతో అక్కడి రాజకీయాలు పెను దుమారం రేపుతున్నాయి. అయితే ఇమ్రాన్‌ఖాన్‌కు (Imran khan) శిక్ష పడిన తర్వాత ఆయన పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (పీటీఐ)పై నిషేధం విధించే అవకాశం ఉందని పాక్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

పీటీఐని నిషేధిస్తారా ?

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రమేయం ఉన్న పీటీఐ వ్యవస్థాపకుడు, ఇతర నేతలపై తీర్పు వచ్చిన తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ (PTI) నిషేధించడం సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పీటీఐకి నిధులపై అనేక సంవత్సరాల విచారణ తర్వాత పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP).. 2003 ఆగస్టులో పార్టీకి ‘నిషేధించబడిన నిధులు’ అందాయని గుర్తించింది. దీంతో ఇది పాక్‌ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) నేతృత్వంలోని పాకిస్థాన్‌ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) ప్రభుత్వానికి పార్టీని రద్దు చేయడానికి అవకాశం కల్పించింది.

Also Read: దటీజ్ ఇండియన్ నేవీ.. సముద్రపు దొంగల నుంచి పాక్ నావికుల్ని కాపాడిన భారత్!

#telugu-news #imran-khan #pakistan-ex-pm-imran-khan #pakisthan-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe