Former MP Ramesh Rathore : మాజీ ఎంపీ, బీజేపీ (BJP) నేత రమేష్ రాథోడ్ (Ramesh Rathore) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ (Hyderabad) కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలం ఉట్నూర్ కు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా, జడ్పీ ఛైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలంగా పని చేశారు రమేష్ రాథోడ్. ఫ్యాట్ సర్జరీ చేపించిన తర్వాత సైడ్ ఎఫెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా ఈ ఇబ్బందితో బాధపడుతున్న రమేష్ రాథోడ్ ఈరోజు మృతి చెందారు. కాగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఒకే రోజు ఇద్దరు నాయకులు మృతి చెందడంతో రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పూర్తిగా చదవండి..Ramesh Rathore : తెలంగాణ బీజేపీ మాజీ ఎంపీ కన్నుమూత
TG: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Translate this News: