Ramesh Rathore : తెలంగాణ బీజేపీ మాజీ ఎంపీ కన్నుమూత

TG: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి  విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

New Update
Ramesh Rathore : తెలంగాణ బీజేపీ మాజీ ఎంపీ కన్నుమూత

Former MP Ramesh Rathore : మాజీ ఎంపీ, బీజేపీ (BJP) నేత రమేష్ రాథోడ్ (Ramesh Rathore) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి  విషమించడంతో హైదరాబాద్‌ (Hyderabad) కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలం ఉట్నూర్ కు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా, జడ్పీ ఛైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలంగా పని చేశారు రమేష్ రాథోడ్. ఫ్యాట్ సర్జరీ చేపించిన తర్వాత సైడ్ ఎఫెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా ఈ ఇబ్బందితో బాధపడుతున్న రమేష్ రాథోడ్ ఈరోజు మృతి చెందారు. కాగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఒకే రోజు ఇద్దరు నాయకులు మృతి చెందడంతో రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రాథోడ్ రాజకీయ ప్రస్థానం..

రమేష్ రాథోడ్ తొలి సారిగా తెలుగు దేశం పార్టీ (TDP) నుండి నార్నూర్ జడ్పీటిసి గా ఎన్నికయ్యారు. ఖానాపూర్ (ఎస్టీ రిజర్వడ)శాసన సభ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నుండి రెండు సార్లు శాసన సభ్యునిగా సేవాలందించారు. రమేష్ రాథోడ్ 1999 - 2004 మద్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యునిగా ఉన్నారు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. 2009 లో 15 వ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యుని గా పనిచేసారు.

అనంతరం తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి లో చేరాడు. కొన్ని నెలలో తర్వత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెష్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చేరి ఖానాపూర్ శాసన సభకు, ఆదిలాబాద్ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఆనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలగి 2021లో భారతీయ జనతా పార్టీ లో చేరారు. 2023లో ఖానాపూర్ శాసన సభ భారతీయ జనతా పార్టీ నుండి పోటి చేసి ఓడిపోయాడు.

Also Read : పెన్షన్‌ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ!

Advertisment
తాజా కథనాలు