/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-19T191355.524-jpg.webp)
Bodige Shobha Husband Galanna: మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ (Bodige Shobha) భర్త బొడిగె గాలయ్య కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించినట్లు బంధువులు, సన్నిహితులు, తెలిపారు. గాలయ్య అంత్యక్రియలు ఆదివారం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్..
ఇక ఈ విషాద ఘటనపై స్పందించిన ఈటల రాజేందర్ ().. 'చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ గారి భర్త గాలన్న గారు కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. వారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గాలన్న మృతి తీరని లోటు, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శోభ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇది కూడా చదవండి : Rashmika: ఆ ఒక్కమాటతో రణ్ బీర్ చెంప పగలగొట్టేశా
బోయినపల్లి వినోద్..
అలాగే అనారోగ్యంతో మృతి చెందిన బొడిగె గాలన్న మృతి తనను ఎంతో బాధించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 'బొడిగె గాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారు. బొడిగె గాలన్న తన సతీమణి శోభక్క గారికి అండగా ఉంటూనే శంకరపట్నం జడ్పీటీసీగా ప్రజలకు సేవ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్నప్పడు శోభక్క గారికి గాలన్న వెన్నంటి ఉన్నారు. గాలన్న చిన్నతనం నుంచే పేదప్రజల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు వామపక్ష పార్టీలలో పని చేశారు. గాలన్న మృతి తీరని లోటు' అని వినోద్ కుమార్ సంతాపం తెలిపారు.