Ex. Minister Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు.. రైతుల(Farmers) కోసమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు(Ex. Minister Harish Rao). చేరికల కోసం బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్తున్న ముఖ్యమంత్రి..రైతులకు చనిపోతుంటే పరామర్శించేందుకు ఎందుకు వెళ్లడం లేదని విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం హరీశ్ రావు పర్యటించారు. ఎండిన పంటలను పరిశీలించిన.. అనంతరం రైతులతో మాట్లాడారు. ఎకరానికి రూ. 25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల దగ్గరకు వెళ్లి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ వందల రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు.
కాగా అటు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు హరీశ్ రావు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Case) లో కాంగ్రెస్(Congress) నేతలు తలో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ కేసులో కాంగ్రెస్ అధిష్టానంది ఒకదారి, సీఎం రేవంత్ ది మరోదారి అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీకి బీటీమ్ లీడర్ గా రేవంత్ రెడ్డి తీర ఉందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఏకీభవించడం లేదని..దీనిలో రేవంత్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి, ఖర్గే, రాహుల్ నాయకత్వంలో పనిచేస్తున్నట్లుగా లేదని..మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నట్లు ఉందన్నారు. అగ్రనాయకులే కాదు.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి : ‘పుష్ప 2’ లో సమంత.. అల్లు అర్జున్ తో కలిసి ఆ పాత్రలో ..!