Ravela Kishore Babu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ ముఖ్యనేతలు పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ (CM YS Jagan) సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి. సీఎం క్యాంప్ కార్యాలయంలో వారిద్దరిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే తన ప్రయాణమన్నారు. 120 సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
Also Read: కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తి గతంగా మాట్లాడుకోవాలి..ఇలా కాదు.. షర్మిలకు కొడాలి నాని కౌంటర్..!
మార్పు కోసం జగన్ పని చేస్తున్నారని.. ఆ యజ్ఞంలో తాను కూడా పాల్గొంటారని చెప్పుకొచ్చారు. పార్టీ లో ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహిస్తానని కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వాలు కింది కులాలను మభ్య పెట్టారని కానీ సీఎం జగన్ అన్ని కులాలను ఆదరించారని కీర్తించారు. 31లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇల్లు నిర్మించి ఇచ్చిన ఘనత జగన్ దేనన్నారు.
Also Read: ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి.. పోటా పోటీగా టీడీపీ వైసీపీ ప్రచారాలు.!
Rtv తో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు, ఆలోచనలు నచ్చి వైసీపీ లో (YSRCP) జాయిన్ అయినట్లు తెలిపారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తానని చెప్పారు. పోటీకి సంబంధించి తాను జగన్ తో ఎం మాట్లాడలేదన్నారు. SC నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ పార్టీ గెలుపు కోసం జగన్ కృషి చేస్తున్నారన్నారు. జగన్ గురించి కొందరూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యనించారు. జనసేనకి రావాలని చాలా మంది అభిమానులు ఆశపడ్డారని కామెంట్స్ చేశారు. తాను ఎం చేయగలనో జగన్ కి తెలుసని..శక్తీ మేరకు జగన్ విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.