Murder : ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య!

మాజీ మావోయిస్టు భీమన్న అలియాస్ రాము దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూల్ జిల్లాకు చెందిన అతన్ని గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి రాళ్లతో కొట్టి చంపేశారు. మృతుడికి కొంతకాలంగా మతి స్థిమితం లేదని, అతను ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Murder : ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య!
New Update

Murder : ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. మాజీ మావోయిస్టు (Maoist )ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని వెంటాడి, వేటాడి రాళ్లతో కొట్టి కొట్టి చంపిన ఘటన కర్నూల్ (Kurnool) జిల్లాల్లో సంచలనం రేపింది. అంతేకాదు బాధితుడి సోదరి ఎమ్మెల్సీ (MLC) పదవిలో ఉండటం గమనార్హం. కాగా ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మాజీ మావోయిస్టు..

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. శనివారం రాత్రి తుగ్గలి మండలంలోని ఆర్ఎస్ పెండేకల్‌లో రాము (Ramu)ను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టారు. దీంతో తీవ్ర గాయలైన రాము అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. మృతుడు మాజీ మావోయిస్టు భీమన్న అలియాస్ రాముగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : CRIME : కసాయి భార్య.. ప్రియుడి మోజులో కట్టుకున్నవాడిపై దారుణం

ఎమ్మెల్సీ సోదరుడు..

అయితే మృతుడు రాముకు కొంతకాలంగా మతిస్థిమితం లేదని, పలు ప్రాంతాల్లో ఒంటరిగానే తిరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారని, ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. ఇక రాము భవనాసి దళ కమాండర్‌గా పనిచేసి 1971లో మావోయిస్టు పార్టీనుంచి బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక చనిపోయిన రాము ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడని సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తామన్నారు పోలీసులు.

#ramu #murder #kurnool-district #maoist
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe