Kiran Kumar Reddy: సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారు.. కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రశంసల వర్షం

AP: మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారని అన్నారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ పంపిన ఘనత మోదీదే అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

New Update
Kiran Kumar Reddy: సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారు.. కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రశంసల వర్షం

Kiran Kumar Reddy:మోదీ.. సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి. ఒక్క అవినీతి ఆరోపణ లేని వ్యక్తి.. మోదీ అని పేర్కొన్నారు. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారని కొనియాడారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ పంపిన ఘనత మోదీదే అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను వేధించేలా జగన్‌ పాలన ఉందని ఫైర్ అయ్యారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు బీజేపీ కల్పించిందని అన్నారు. బీజేపీకి వచ్చే 375 సీట్లలో మన రాజంపేట కూడా ఉండాలని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు