రాజకీయ నాయకుడి కొడుకుకే ఆసుపత్రిలో బెడ్‌ లేదు..ఇక సామాన్యుల సంగతేంటి?

దవాఖానాలో బెడ్‌ లేక ఉత్తర్‌ ప్రదేశ్‌ లఖ్‌నవూకు చెందిన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్‌ ప్రసాద్‌ మిశ్రా కుమారుడు ప్రకాశ్‌ మిశ్రా మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాజీ ఎంపీతో పాటు ఆయన బంధువులు ఆసుపత్రిలో నిరసనకు దిగారు. దీని గురించి విచారణ చేపడతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

రాజకీయ నాయకుడి కొడుకుకే ఆసుపత్రిలో బెడ్‌ లేదు..ఇక సామాన్యుల సంగతేంటి?
New Update

ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ఎందరో సామాన్యులు ప్రాణాలు విడిచిన ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. కానీ ఇక్కడ ఓ రాజకీయ నాయకుని కుమారుడు కూడా ఆసుపత్రిలో బెడ్‌ ఖాళీ లేక ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని లఖ్‌నవూలో జరిగింది. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్‌ ప్రసాద్‌ మిశ్రా కుమారుడు ప్రకాశ్‌ మిశ్రా.

ప్రకాశ్‌ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని నగరంలోని సంజయ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ప్రకాశ్‌ కండీషన్‌ సీరియస్‌ గా ఉండడంతో ఆయన్ని ఐసీయూకి తరలించాలని వైద్యులు సూచించారు.

Also read: ‘డ్రామారావు.. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార’.. మొండి కత్తి డ్రామా!

కానీ అప్పటికే ఆసుపత్రిలో ఉన్న ఐసీయూ బెడ్లు అన్ని కూడా రోగులతో నిండిపోయాయి. దీంతో డాక్టర్లు ఆయనకు వైద్యం కూడా అందించలేదు. ఈ క్రమంలోనే ప్రకాశ్‌ మరణించాడు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎంపీ..వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్ లోనే నిరసనకు దిగారు.

ఆయనతో పాటు మృతుడి బంధువులు కూడా హాస్పిటల్‌ లో ధర్నాకు దిగారు. దీంతో ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్ ఆర్కే ధీమాన్‌ ఆదివారం తెల్లవారు జామున ఆసుపత్రికి వచ్చారు. రావడంతోనే జరిగిన సంఘటన గురించి ఆరాతీశారు. ఆయన మాజీ ఎంపీ వద్దకు వెళ్లి నిరసన విరమించాలని నచ్చజెప్పారు.

Also read: ఉదయాన్నే సిగరేట్ తాగే అలవాటు ఉందా? అయితే ఈ రోగాలు గ్యారెంటీ..!!

వెంటనే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా బాధ్యుల పై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వెల్లండిచారు. దీంతో మాజీ ఎంపీ శాంతించి కుమారుడి మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రకాశ్‌ చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తుంటే..వైద్యులు మాత్రం ఆయన ఆసుపత్రికి వచ్చే సరికే ఆయన పరిస్థితి చాలా సీరియస్‌ గా ఉందని..ఆ సమయంలోనే హాస్పిటల్‌ ఎమర్జెన్సీ బెడ్లు కూడా అన్ని నిండి పోవడంతో మేము ఏం చేయాలేకపోయామని వివరించారు.

ఒక రాజకీయ నాయకుని కుమారుని విషయంలోనే వైద్యులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ..ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

#son #lucknow #uttar-pradesh #hospital #ex-mp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe