Civil Service Administrator Changed Gender : భారత పరిపాలన చరిత్రలో తొలిసారిగా ఓ సివిల్ సర్వీస్ అధికారి తన లింగాన్ని (Gender) మార్చుకున్నారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.హైదరాబాద్ (Hyderabad) లోని కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యునల్ విభాగంలో అసోసియేట్ కమిషనర్‌గా పనిచేస్తున్నఅనసూయ అనే IRS అధికారి (IRS Officer) తన పేరు, లింగాన్ని మార్చుకున్నారు.ఆమె తన పేరు అనుసూయ నుండి అనుకతిర్ సూర్యగా,లింగం ఆడ నుంచి మగగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. దీనికి మంత్రిత్వ శాఖ ఆమె పేరు,లింగాన్ని మార్చుకోవడానికి అనుమతించింది.
అధికారుల పేర్లను మార్చడం మనం తరచుగా చూశాం. అయితే ఇక్కడ అనుసూయ తన లింగాన్ని మార్చుకుంది. దీని ఆధారంగా అనుసూయ అన్ని పరిపాలనా పత్రాలు Mr. ఎం. అనుకదిర్ సూర్యగా మార్చారు.IRS అధికారి అయిన ఆయన 2013 డిసెంబర్‌లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. తర్వాత 2018లో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొంది ప్రస్తుతం అత్తారాభట్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
Also Read : ఇష్టంగా టీ తాగుతున్నారా? అది కష్టాన్ని తేవచ్చు.. క్యాన్సర్ కారణం కావచ్చు!!