Bhuvanagiri: తెలంగాణ గురుకుల హాస్టల్‌ లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థి మృతి!

భువనగిరి ప్రభుత్వ గురుకుల హాస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. బ్రేక్‌ ఫాస్ట్‌లో భాగంగా పులిహోర తిన్న 24మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జిబ్‌లక్‌పల్లికి చెందిన ప్రశాంత్‌ మృతి చెందాడు.

New Update
Bhuvanagiri: తెలంగాణ గురుకుల హాస్టల్‌ లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థి మృతి!

Gurukula Hostel: తెలంగాణ ప్రభుత్వ గురుకుల హాస్టల్ లో ఘోర విషాధం జరిగింది. ప్రభుత్వ టీచర్లు, యాజమాన్యం నిర్లక్ష్యానికి భువనగిరిలో  హాస్టల్ లో చదువుతున్న మరో విద్యార్థి బలయ్యాడు.  బ్రేక్‌ ఫాస్ట్‌ కోసం కలిపిన పులిహోర విషయమంగా మారడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచానాలతో ఇబ్బంది పడ్డారు. విషయం గమనించిన యాజమాన్యం అందరినీ దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించినప్పటికీ ఉపయోగం లేకపోయింది.

ఇది కూడా చదవండి:Ongole: SI వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య..!

జిబ్‌లక్‌పల్లిలో విషాదఛాయలు..
ఈ మేరకు ఏప్రిల్ 12న హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన జరిగినట్లు విద్యార్థులు, పోలీసులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నూమూశాడు. మృతుడు ప్రశాంత్‌ది పోచంపల్లి మండలం జిబ్‌లక్‌పల్లిగా గుర్తించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisment
తాజా కథనాలు