Food Poison: మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌!

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా సోరో బ్లాక్ లోని సిరాపూర్‌ గ్రామంలో మధ్యాహ్న భోజనం తిని 100 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ఉదయన్‌ నారాయణ నోడల్‌ స్కూల్‌ లో గురువారం మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

Food Poison: మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌!
New Update

Food Poison: ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా సోరో బ్లాక్ లోని సిరాపూర్‌ గ్రామంలో మధ్యాహ్న భోజనం తిని 100 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ఉదయన్‌ నారాయణ నోడల్‌ స్కూల్‌ లో గురువారం మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

విద్యార్థులు తిన్న ఆహారంలో బల్లి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. భోజనం ప్రారంభించిన కొద్దిసేపటికే ఓ చిన్నారి అందులో బల్లిని గుర్తించింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల అధికారులు భోజన పంపిణీని నిలిపివేసి విద్యార్థులను తినవద్దని చెప్పారు.

అయితే అప్పటికే చాలామంది విద్యార్థులు భోజనం చేసేశారు. దీంతో వారికి కడుపునొప్పి, ఛాతీ నొప్పి వంటి సమస్యలు మొదలయ్యాయి. దీని తరువాత ఉపాధ్యాయులు అంబులెన్స్.. ఇతర వాహనాలలో బాధిత విద్యార్థులను సోరో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించారు. సీహెచ్‌సీకి చెందిన వైద్య బృందం పాఠశాలను సందర్శించి పిల్లలకు చికిత్స అందించారు. వైద్యం అందించిన అనంతరం విద్యార్థులు తిన్న ఆహారాన్ని వాంతులు చేసుకున్నారని వైద్యులు తెలిపారు.

బాధిత విద్యార్థులందరినీ తదుపరి చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఉదయనారాయణ నోడల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది వారిని ఆసుపత్రిలో చేర్చారు అక్కడకు వెళ్లిన అధికారులు ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. 50 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉంది.

మరికొందరు తల్లిదండ్రులు చికిత్స అనంతరం తమ పిల్లలతో ఇంటికి చేరుకోగా, మరికొందరు ఉపాధ్యాయులను సంప్రదించగా, మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత కొంత మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. భోజనం చేసిన తరువాత పాఠశాలలో తలనొప్పి, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు వచ్చాయి. విచారణ జరిపి ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also read: టాలీవుడ్ లో మహేష్ కు మాత్రమే సొంతమైన ఏకైక రికార్డు ఏంటో తెలుసా?

#odisha #school #mid-day-meal #balasore #students
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి