Health Tips: నైట్ డ్యూటీ చేస్తున్నారా? ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు..

మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా? అయితే, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. నైట్ డ్యూటీ చేసేవారు ఈ ఆహారం తీసుకోవాలని ఆరోగ్య ని పుణులు సూచిస్తున్నారు. మొలకలు, వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్‌రూట్, కీర దోసకాయ, గుడ్లు, డార్క్ చాక్లెట్‌ను తినొచ్చు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Health Tips: నైట్ డ్యూటీ చేస్తున్నారా? ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు..
New Update

Healthy Food for Night Duty: సాధారణంగా నైట్ షిఫ్ట్ లో పనిచేయడం కాస్త కష్టమే. ఈ షిఫ్ట్(Night Duty) మన ఆరోగ్యాన్ని(Health) తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని మెయింటెన్ చేస్తున్నప్పుడు.. ఈ నైట్ షిప్ట్ మన దినచర్యను పాడు చేస్తుంది. ఊహించని ఓవర్ టైం, మారిన జీవనశైలితో ఆరోగ్యం పాడవుతుంది. అయితే, నైట్ షిఫ్ట్‌లో కూడా ఆరోగ్యం సరిగా ఉండాలంటే.. సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి పోషకాహారం తీసుకోవడం వలన నైట్ షిఫ్ట్ డ్యూటీ చూసినా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి వేళ పని చేసే వారు తప్పక తినాల్సిన ఆహారం గురించి వైద్యులు కీలక సూచనలు చేశారు. మరి ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దాం..

నైట్ షిఫ్ట్‌లో తినాల్సిన ఆహారాలు..

మొలకలు, వాల్‌నట్స్: బాదం, వాల్‌నట్ వంటి ఆరోగ్యకరమైన పప్పులు, గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. చియా, ఫ్లాక్స్ సీడ్ వంటి గింజల్లో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని నిరంతరం విడుదల చేస్తాయి. నైట్ డ్యూటీ సమయంలో మీలో ఏకాగ్రతను పెంచుతాయి. పైగా వీటిని మీ వెంట తీసుకెళ్లడం కూడా చాలా సులభం. వీటిని ప్రత్యేకించి వండాల్సిన అవసరం కూడా లేదు. అనుకూలమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా వీటిని తినొచ్చు.

క్యారెట్, దోసకాయ: క్యారెట్, దోసకాయలో తక్కువ కేలరీలు, ఎక్కువ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అవి సంతృప్తికరమైన అనుభూతిని కలిగిస్తాయి. వీటిని రుచి కోసం పెరుగుతో కలిపి కూడా తినొచ్చు. నైట్ షిఫ్ట్‌లో వీటిని స్నాక్స్‌గా తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

గుడ్లు: ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. గుడ్లలో అధిక ప్రోటీన్స్, అవసరమైన అమైనో ఆమ్లాలు, బి12 వంటి విటమిన్లతో సహా అనేక పోషకాలు ఉంటాయి. అందుకే గుడ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. గుడ్లు శరీరానికి అధిక శక్తిని అందిస్తాయి. ఉడకబెట్టి గానీ, హాఫ్ బాయిల్ చేసి గానీ గుడ్లను తినొచ్చు. నైట్ డ్యూటీ సమయంలో గుడ్డును తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, కొద్ది మొత్తంలో కెఫిన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకోవడం వల్ల ఫోకస్ మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఇందులో సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది స్వీట్ స్నాక్స్‌కి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం అధిక కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్‌ను తినొచ్చు.

సమతుల్య ఆహారం: నైట్ డ్యూటీ చేసేటప్పుడు సాధారణ ఆరోగ్య ప్రయోజనం కోసం సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారాన్ని తినడం వల్ల మరింత శక్తి పొందుతారు. రాత్రి అలసటతో పోరాడటానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

Also Read:

TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Nara Lokesh CID: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ

#health-tips #healthy-food #healthy-diet #night-duty #food-for-night-duty #energy-food
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe