AP CM Chandra babu: బ్యాంకర్లు.. ఇన్స్యూరెన్స్ తో సమావేశం జరిగిందని.. ఇందులో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు సీఎ చంద్రబాబు. చిన్న వ్యాపారాలు చేసుకొనేవారికి… వాహనాలకు జరిగిన నష్టం దృష్టిలో పెట్టుకొని 10 రోజుల కాల పరిమితి పెట్టుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే వారు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని చెప్పారు. గృహాలలో ఉన్న పరికరాలకు.. వస్తువులు నష్టపోయినవారిని ఆదుకునేందుకు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి వరద బాధితులకు ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: 10 రోజుల్లో సమస్యల పరిష్కరిస్తాం–సీఎం చంద్రబాబు
వరద ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపటి నుంచి కూరగాయలు సబ్సిడీతో ఇస్తున్నాం. రూ.2, రూ.5, రూ.10, మూడు రేట్లు మాత్రమే ఉంటాయి. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని తెలిపారు.
Translate this News: