వయసు పెరిగేకొద్ది శరీరంలో మార్పులు వస్తుంటాయి. కళ్ల కింద క్యారీ బ్యాగులు రావడం, ముఖంపై ముడుతలు ఏర్పడటం లాంటి వల్ల చాలామంది కంగారుపడుతుంటారు. మరికొందరైతే పెరిగిన వయసు కనిపించుకుండా ఉండేందుకు మేకప్ వేసుకుంటారు. అయితే సరైన డైట్‌ను పాటిస్తే.. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను కొంత నియంత్రించవచ్చు. యవనాన్ని మరికొంత కాలం వరకు పదిలంగా ఉంచుకోవచ్చు.
Also Read: వేసవిలో హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుకోవాలంటే..వీటిని తినాల్సిందే!
ఇందుకోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లూబెర్రీలు తీసుకుంటే అవి యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తూ.. చర్మం నిగారించేలా చేసేందుకు ఉపయోగపడతాయి. చిలకడదుంప, గుమ్మడికాయ, క్యారెట్‌లో బీటా కేరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వయసు పెరిగేకొద్ది శరీరంలో వచ్చే మార్పులను నియంత్రించడంలో ప్రభావితంగా పనిచేస్తాయి. ఆకుకూరలు రెగ్యులర్‌గా తినడం వల్ల ముఖర్చస్సు కూడా తగ్గ
ఆకుకూరలు రెగ్యులర్‌గా తినడం వల్ల ముఖవర్చస్సు తగ్గకుండా ఉంటుంది. అలాగే కీరదోసలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. ప్రతిరోజూ పాలలో గుప్పెడు బాదం నానబెట్టుకొని తింటే.. నిత్యం యవ్వనంగా కనిపిస్తారు. ఇక విటమిన్-సీ అధికంగా ఉండే బ్రకోలీ తీసుకుంటే చర్మంపై ముడతలు లేకుండా పోతాయి. అంతేకాదు సాల్మన్ చేపలు కూడా యాంటీ ఏజింగ్‌కు పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపిస్తారు.
Also Read: నెగటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తుల్లో.. ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ..!