Onions: ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఎప్పుడూ పొడి వాతావరణంలో ఉంచాలి. గాలి కూడా ఎక్కువగా వచ్చేలా చూసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లి కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే దానిని చల్లగా ఉండే ప్లేస్‌లో పెట్టాలి. By Vijaya Nimma 18 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Onions: సాధారణంగా ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోవడం, పాడవడం జరుగుతుంటుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పాడవకుండా కాపాడుకోవచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం అసంపూర్ణం అని చెప్పాలి. అయితే ఈ మూడింటిని సరిగ్గా ఉంచుకోకపోతే ముఖ్యంగా వేసవిలో కుళ్లిపోతుంటాయి. ఉల్లిపాయలను ఎప్పుడూ పొడి వాతావరణంలో ఉంచాలి. గాలి కూడా ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. కొన్ని నిల్వ చేసే పద్ధతుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. కుళ్లిపోకుండా ఇలా కాపాడుకోండి: ఉల్లిపాయలను కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే దానిని చల్లని వాతావరణంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు ఎక్కువ కాలం కుళ్ళిపోదు. బంగాళదుంపలు, ఉల్లిపాయలను వంటగదిలో వెంటిలేషన్ బాగా వచ్చే ప్రదేశంలో ఉంచండి. వేడి, సూర్యకాంతి నుంచి రెండింటినీ దూరంగా ఉంచాలి. అవసరమైతే తప్ప ఉల్లిపాయలను కడగవద్దని నిపుణులు అంటున్నారు. ఇతర కూరగాయలతో కలపవద్దు: ఉల్లిపాయలను పొడి గుడ్డతో తుడిచి ఆపై నిల్వ చేయండి. ఉల్లిపాయలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచకుండా వాటిని బుట్టలో నిల్వ చేయాలి. అన్ని వైపుల నుంచి గాలి వచ్చే కంటైనర్‌ను ఉపయోగించండి. ఉల్లిపాయలను ఇతర పండ్లు మరియు కూరగాయల నుంచి దూరంగా ఉంచాలని నిపుణులు అంటున్నారు. తడిగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలి. లేకపోతే వెంటనే కుళ్లిపోతుందని, ఉల్లిపాయల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెష్‌లను ఉపయోగించాలని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వేసవిలో చర్మ సంరక్షణ..ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #onions #kichen-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి