Kichen tips : భారీగా పెరిగిన వాటి ధరలు.. ఎంతంటే?
మరికొన్ని రోజుల్లో నవరాత్రులు షురూ కానున్నాయి. కానీ అంతకుముందే సామాన్యులకు షాకిచ్చింది ద్రవ్యోల్బణం. పిండి, నూనె కాకుండా, వంటగదికి సంబంధించిన ప్రతి వస్తువు ధరలు పెరిగాయి. జీలకర్ర కిలో రూ. 800కి చేరగా, ఎర్ర మిర్చి, పసుపు, గరం మసాలా ధరలు కూడా పెరిగాయి. చక్కెర కూడా ఖరీదుగా మారి కిలో రూ.44కు చేరింది. ద్రవ్యోల్బణం ప్రభావంతో పప్పుల ధరలు కూడా పెరిగాయి. ద్రవ్యోల్బణం సామాన్యులను మళ్లీ ఇబ్బంది పెడుతోంది. పప్పులు, మసాలా దినుసులపై కేవలం నెల రోజుల్లోనే ధరలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న పప్పులు, మసాలాల ధరలు సామాన్యుడి బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుగంధ ద్రవ్యాల ధరల పెరుగుదల పౌరుల జేబులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పప్పులు కొనాలంటేనే జంకుతున్నారు.