Tips : మీ ఇంట్లో నుంచి బొద్దింకలను తరమాలంటే.. ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!!

ఇంట్లో బొద్దింకల బెడదను తట్టుకోలేకపోతున్నారా? అయితే వీటిని వదిలించుకునేందుకు బేకింగ్ సోడా సహాయం తీసుకోవచ్చు. బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీళ్లలో కలిపి...దానికి కొంచెం చెక్కెర కలపండి. బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. ఫలితం మీరే చూస్తారు.

Kitchen Tips : ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో నుంచి బొద్దింకలు పరార్!
New Update

ఇంట్లో బొద్దింకలు పాకుతుంటే...ఏదోలా అనిపిస్తుంది. పల్లెలు, పట్నాలు తేడా లేకుండా బొద్దింకలు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంటాయి.వాటికి అనుకూలమైన వాతావరణం లభిస్తే ఆ స్థలాన్ని ఆక్రమించి తమ సంతతిని పెంచుకుంటాయి.వీటిని చూస్తే ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భయపడుతుంటారు. ఇవి ఒక రకమైన చికాకు కలిగించే పార్టీలు. బొద్దింకలు ఇంట్లో ఎక్కడైనా ఉండవచ్చు. వంటగది, బాత్రూం, చీకటిగా ఉన్న ప్రదేశాల్లో వీటి సంతతిని పెంచుకుంటాయి. కాబట్టి ఇంట్లో బొద్దింకలను ఎలా వదిలించుకోవాలి? ఇది సులభమైన పనినా? తెలుసుకుందాం...

ఇది కూడా చదవండి: టెన్త్ పాసైన వారికి శుభవార్త.. ఎల్ఐసీ నుంచి రూ.30 వేల స్కాలర్షిప్.. దరఖాస్తు ఇలా..!!

బేకింగ్ సోడా:
బొద్దింకల బెడద నుంచి గట్టెక్కేందుకు మీరు బేకింగ్ సోడా సహాయం తీసుకోవచ్చు. బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీటిలో తీసుకుని కలిపి...అందులో కొంచెం చక్కెరను కలపండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశంలో స్ప్రే చేయండి.

కిరోసిన్:
కిరోసిన సహాయతో కొన్ని నిమిషాల్లోనే బొద్దింకలను వదిలించుకోవచ్చు. ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో కిరోసిన్ నింపి బొద్దింకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. ఇలా బొద్దింకలు నిమిషాల్లోనే దాని వాసన నుంచి పారిపోతాయి.

పలావ్ లీఫ్ పౌడర్:
మీరు బొద్దింకలను వదిలించుకునేందుకు పలావ్ ఆకుల పొడిని ఉపయోగించవచ్చు. దీనికోసం ఆకులను మెత్తగా రుబ్బి ఈ పొడిని ఇంట్లోని ప్రతి మూలలో చల్లుకోండి.

పిప్పరమెంట్ నూనె:
బొద్దింకలను వదిలించుకునేందుకు పిప్పరమెంట్ నూనెను కూడా వాడుకోవచ్చు. దీనికోసం ఒక గ్లాసు నీటిలో పిప్పరమెంట్ నూనె కలిపి...అందులో కాస్త ఉప్పు వేసి స్ప్రే బాటిల్ లో నింపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!!

లవంగాలు:
ఇంట్లో నుంచి బొద్దింకలను తరిమికొట్టేందుకు లవంగాలను కూడా ఉపయోగించవచ్చు. 10-12 లవంగాల పొడిని తీసుకుని బొద్దింకలు కనిపించే ప్రదేశాల్లో ఉంచండి. లవంగాలను నీటిలో మరిగించి చల్లుకున్నా బొద్దింకలు పారిపోతాయి.

(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)

#cockroaches #kitchen-tips #tips #kitchen-hacks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి