Kitchen Hacks : పిండి పురుగు పట్టకుండా ఉండాలంటే...ఈ టిప్స్ ఫాలో అవ్వండి...!!
ఇంట్లో పప్పులు, బియ్యం, మసాలాలు మొదలైన ధాన్యాలను నిల్వచేసే సంప్రదాయం మనదేశంలో ఎప్పటి నుంచో వస్తోంది. పాతకాలం వారు పెద్ద పెద్ద కుండల్లో ధాన్యం నిల్వచేస్తారు. ఇప్పుడు ప్లాస్టిక్, స్టీల్ డబ్బాల్లో నిల్వచేస్తున్నారు. మనలో చాలా మంది బియ్యంతోపాటు పప్పులు, మసాలా దినుసులను డబ్బాల్లోనే నిల్వచేస్తుంటారు. అవసరం అయినప్పుడు మాత్రమేవాటిని తీసి వినియోగిస్తారు. అయితే నిల్వచేసిన పిండిలో తేమ ఉన్నట్లయితే వాటికి పురుగులు పడుతుంటాయి. అవి మెల్లమెల్లగా తింటూ పిండిని మొత్తం పాడు చేస్తాయి. అలాంటప్పుడు నిత్యావసర సరుకులకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఎలాంటి రసాయనాలు అవసరం లేదు..ఇంట్లో ఉండే సహజ సిద్ధ పదార్ధాలతో వాటికి చెక్ పెట్టొచ్చు.