Donald Trump: దోషిగా తేలిన ట్రంప్‌.. జైలుకెళ్తారా ?

శృంగారతార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ దోషిగా తేలారు. ఆమెకు అక్రమ చెల్లింపులు (హుష్‌మనీ) చేసిన కేసులో న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖారారు చేయనుంది.

New Update
Donald Trump: దోషిగా తేలిన ట్రంప్‌.. జైలుకెళ్తారా ?

గత కొంతకాలంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్.. శృంగారతార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన దోషిగా తెలారు. స్టార్మీ డేనియల్‌కు అక్రమ చెల్లింపులు (హుష్‌మనీ) చేసిన కేసులో న్యూయార్క్‌ కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువయ్యాయని.. కోర్టు నిర్ధరించింది. దీంతో ఒక క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షునిగా ట్రంప్ రికార్డుకెక్కారు.ఏంటీ

 ఏంటీ ఈ కేసు 
2006లో డొనాల్డ్ ట్రంప్‌ తనను లైంగికంగా వాడుకుని ఈ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని శృంగారతార స్టార్మీ డేనియల్‌ ఆయనపై హుష్‌మనీ కేసు ఫైల్‌ చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయంపై నోరు విప్పకుండా పెద్ద మొత్తంలో అక్రమంగా డబ్బు ముట్టజెప్పారని ఆరోపించారు. దీనిపై గత కొంత కాలంగా కోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. అయితే స్టార్మీ డేనియల్స్ ఈ అంశంపై మాట్లాడకుండా చేసేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్‌ దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనపై 34 అభియోగాలు రుజువైనట్లు.. 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.

Also Read: ఆ షరతులకు ఒప్పుకుంటే.. యుద్ధం ఆపేస్తాం.. ప్రకటించిన హమాస్ 

ట్రంప్‌ జైలుకెళ్తారా ?
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ట్రంప్‌ దోషిగా తేలడం రాజకీయంగా దుమారం రేపుతోంది. మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ట్రంప్‌ను ఓడించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే జులై 11న కోర్టు ట్రంప్‌కు శిక్ష ఖరారు చేయనుంది. బిజినెస్ రికార్డులను తారుమారు చేయడం అనేది న్యూయార్క్‌లో తక్కువ నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసులో గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. దీనిపై పూర్తి అధికారం న్యాయమూర్తికే ఉంటుంది. జైలుశిక్ష కచ్చితంగా విధిస్తారని కూడా చెప్పలేమని అక్కడి న్యాయనిపుణలు చెబుతున్నారు. జైలుశిక్ష కాకుండా జరిమానా కూడా వేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి నేరాల్లో దోషిగా తేలినవారికి తక్కువ తీవ్రత శిక్షలు లేదా కేవలం జరిమామానా మాత్రమే విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

జైలు శిక్ష పడితే అధ్యక్ష పదవికి అర్హత ఉంటుందా

ఇదిలాఉండగా.. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ట్రంప్‌.. హుష్‌మనీ కేసులో జైలుశిక్ష పడినా కూడా ఆయన ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు, అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని తెలుస్తోంది. ఎంతటి శిక్ష పడినా.. ట్రంప్ ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌ వెళ్లే ఛాన్స్ ఉంది. మరోవైపు పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లికన్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ట్రంప్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడ ఉన్నాయి…ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా పై ఇజ్రాయిల్‌ సీరియస్‌!

నేను అమాయకుణ్ని
ట్రంప్‌ దోషిగా తేలిన అనంతరం కోర్టు బయట మీడియాతో మాట్లాడారు. నేను అమాయకుణ్నని ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. చివరి వరకు పొరాడి గెలుస్తా అని చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు