తెలంగాణలో వరదల ప్రభావానికి పలు చోట్ల తీవ్ర నష్టం జరుగుతోంది. చాలాచోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా పురషోత్తమగూడెంలో ఓ బ్రిజ్జి కొట్టుకుపోయింది. బ్రిడ్జితో పాటు సుమారు అర కిలోమీటర్ వరకు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మరిపెడ - మహబూబాబాద్‌కు రాకపోకలు ఆగిపోయాయి. రోడ్లపై ఉద్ధృతంగా వరద ప్రవాహం ఉంది.
Also Read: ప్రకాశం బ్యారేజ్ విల విల.. 121 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి
మరోవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. పాలేరు వరద ఉద్ధృతికి రహదారి కోతకు గురైంది. అలాగే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ వద్ద లెవన్ వంతెన కూడా కోతకు గురైంది. మోయతుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్లే ఈ వంతెన కొట్టుకుపోయింది. సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై నుంచి రాకపోకల నిలిపివేశారు.