Telangana : తెలంగాణకు తీవ్ర నష్టం.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు

వరదల ప్రభావానికి తెలంగాణలో పలు చోట్ల తీవ్ర నష్టం జరుగుతోంది. రోడ్లు తెగిపోతున్నాయి. బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోతున్నాయి. చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది.

New Update
Telangana : తెలంగాణకు తీవ్ర నష్టం.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు

తెలంగాణలో వరదల ప్రభావానికి పలు చోట్ల తీవ్ర నష్టం జరుగుతోంది. చాలాచోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా పురషోత్తమగూడెంలో ఓ బ్రిజ్జి కొట్టుకుపోయింది. బ్రిడ్జితో పాటు సుమారు అర కిలోమీటర్‌ వరకు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మరిపెడ - మహబూబాబాద్‌కు రాకపోకలు ఆగిపోయాయి. రోడ్లపై ఉద్ధృతంగా వరద ప్రవాహం ఉంది.

Also Read: ప్రకాశం బ్యారేజ్‌ విల విల.. 121 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి

మరోవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. పాలేరు వరద ఉద్ధృతికి రహదారి కోతకు గురైంది. అలాగే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా బస్వాపూర్‌ వద్ద లెవన్‌ వంతెన కూడా కోతకు గురైంది. మోయతుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్లే ఈ వంతెన కొట్టుకుపోయింది. సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై నుంచి రాకపోకల నిలిపివేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు