Heavy Rains In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఆంధ్రాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దానికి తోడు గోదావరికి (Godavari) ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ముంచుకొస్తోంది. దీంతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాలు డేంజర్ జోన్‌లో పడ్డాయి. నిన్న ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వరిచేలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉద్ధృతి పెరగడంతో.. రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీని వలన రాకపోకలు కూడా స్తంభించి పోయాయి. వర్సాల కారణంగా ఆంధ్రా-తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల మేర గండి పడింది. దీంతో ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడులు ముంపుకు గురయ్యాయి. ఇప్పటికే వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, అల్లూరినగర్, రాళ్లపూడి తదితర గ్రామాల్లో కొన్ని ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. గండి కారణంగా వరద ఉద్ధృతి మరింత పెరిగి మరికొన్ని గ్రామాు కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..AP Rains: ఏపీలో పొంగుతున్న వాగులు, వంకలు
ఆగకుండా పడుతున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. దానికి తోడు గోదావరికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీరు గోదావరి జిల్లాలవారికి ఆందోళన కలిగిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో..విలీన మండలాలకు ముప్పు తప్పేలా కనిపించడం లేదు.
Translate this News: