AP Rains: ఏపీలో పొంగుతున్న వాగులు, వంకలు

ఆగకుండా పడుతున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. దానికి తోడు గోదావరికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీరు గోదావరి జిల్లాలవారికి ఆందోళన కలిగిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో..విలీన మండలాలకు ముప్పు తప్పేలా కనిపించడం లేదు.

New Update
AP Rains: ఏపీలో పొంగుతున్న వాగులు, వంకలు

Heavy Rains In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఆంధ్రాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దానికి తోడు గోదావరికి (Godavari) ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ముంచుకొస్తోంది. దీంతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాలు డేంజర్‌ జోన్‌లో పడ్డాయి. నిన్న ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వరిచేలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉద్ధృతి పెరగడంతో.. రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీని వలన రాకపోకలు కూడా స్తంభించి పోయాయి. వర్సాల కారణంగా ఆంధ్రా-తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల మేర గండి పడింది. దీంతో ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడులు ముంపుకు గురయ్యాయి. ఇప్పటికే వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, అల్లూరినగర్, రాళ్లపూడి తదితర గ్రామాల్లో కొన్ని ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. గండి కారణంగా వరద ఉద్ధృతి మరింత పెరిగి మరికొన్ని గ్రామాు కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది.

గోదావరిలో వరద పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని విడిచిపెడుతున్నారు. దీని కారణంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంక గోదావరి వరదరేవులోకి గురువారం వశిష్ఠ గోదావరి నుంచి వచ్చి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి రోడ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో సుమారు 7,400 ఎకరాలు నీట మునిగిపోయాయి. కోనసీమ జిల్లాలో 5,500 ఎకరాలకు సరిపడా వేసిన నారుమడులు మునిగిపోయాయి.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో మరింత బలపడనుంది. ఆ తర్వాత ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ మీద ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రా అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

Also Read:World’s Strange Thing: బంగారం ఇచ్చినా దొరకని బ్లడ్ గ్రూప్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు