Flipkart Republic Day Sale 2024: ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్...ఆ ఫోన్లపై భారీ ఆఫర్లు, తగ్గింపులు..!!

రిపబ్లిక్ డే, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్ ను తీసుకువచ్చింది. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఐపోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ, వివో ఫోన్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు ఉంటుందని తెలిపింది.

New Update
Flipkart Republic Day Sale 2024: ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్...ఆ ఫోన్లపై భారీ ఆఫర్లు, తగ్గింపులు..!!

Flipkart Republic Day Sale 2024: ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు గుడ్ న్యూస్ . ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024 (Flipkart Republic Day Sale 2024)ను మరో నాలుగు రోజుల్లో ప్రారంభించనుంది. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, ధరల తగ్గింపు భారీగా ఉండనున్నాయి. 6 రోజుల రిపబ్లిక్ డే సేల్ (6 Days Republic Day Sale)ఫ్లిప్ కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఒక రోజు ముందే అందుబాటులోకి వస్తుంది.

స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్స్ పై భారీ డిస్కౌంట్: 

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా పలు రకాల మొబైల్ ఫోన్లు(Mobile phones), ల్యాప్ టాప్స్(Laptops), ట్యాబ్లెట్లు(Tablets), స్మార్ట్ వాచీలు, ఇయర్ బడ్స్, స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ల(Huge discount offers)ను ప్రకటించింది. కొన్ని సెలక్ట్ చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డ్స్(Credit cards) పై డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా యాపిల్, శాంసంగ్, గూగుల్, రియల్ మీ ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. కొన్ని రకాల వస్తువులపై కూడా ఏకంగా 85శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ లో ఆపిల్ , శాంసంగ్, రియల్ మీ, మోటోరోలా స్మార్ట్ ఫోన్ల ధరల్లో భారీ డిస్కౌంట్ ఉంటుంది. ఐఫోన్ 14 గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ, మోటోరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ ఎఫ్ 145జీ,రియల్ మీ సి 53 , రియల్ మీ 11ఎక్స్ 5జీ, మోటో జి 54 వంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఉంటుంది.

జనవరి 14 నుంచి జనవరి 19 వరకు సేల్: 

ఇక ఈ సేల్ జనవరి 14 నుంచి జనవరి 19 (January 14 to January 19)వరకు అందుబాటులో ఉంటుంది. కానీ ఫ్లిప్ కార్డు సభ్యులకు మాత్రం జనవరి 13 రాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. వివో ఎక్స్ 100 సిరీస్, ఒప్పో రెనో 11 సిరీస్, ఇన్ఫెనిక్స్ స్మార్ట్ 8, రెడ్మీ నోట్ 13 ప్రో, పోకో ఎక్స్ 6 సిరీస్ ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ వారంలోనే అంటే జనవరి 15 నుంచి ఫ్లిప్ కార్ట్ ప్రత్యర్ధి అమెజాన్ కూడా రిపబ్లిక్ డే సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి : మీరు ఎలాంటి వారో మీ బ్లడ్ గ్రూప్ చెబుతుందట..తాజా పరిశోధనలో వెల్లడి..!!

Advertisment
తాజా కథనాలు