/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Doctor-Family-Suicide-jpg.webp)
Vijayawada Doctor Family Suicide: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుబంలో ఐదుగురు మృతి చెందడం కలకలం రేపింది. గురునానక్ నగర్‌లోని డా. డీ. శ్రీనివాస్ మృతదేహం ఇంటి బయట కనిపించింది. ఇంటి లోపల అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు కనిపించాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే ఈ కుటుంబ సభ్యులు ఎలా మృతి చెందారనే విషయాలు ఇంకా తెలియలేదు. ఇది హత్యనా లేదా ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే వాళ్ల గొంతులు కోసి ఉన్నట్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఇటీవల శ్రీనివాస్ ఓ ఆస్పత్రిని పెట్టారు. అందులో నష్టాలు రావడంతో ఆ ఆసుపత్రిని అమ్మేశారు. అప్పటినుంచి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయితే ఆయనే కుటుంబాన్ని హత్యచేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: కూటమికి షాక్.. స్వతంత్ర అభ్యర్థులు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు