NEET: నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు సహకరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఇప్పటి వరకు గుజరాత్ పంచమహ జిల్లా గోద్రా పట్టణంలో ఓ స్కూల్ కు చెందిన ప్రిన్సిపల్ తో పాటు మరో నలుగురు టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 27 మంది మంది విద్యార్థులతో వీరంతా రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.
గత నెల 5న నిర్వహించిన నీట్ పరీక్షకు ఈ స్కూల్ ఓ సెంటర్‌గా ఉంది. అయితే పరీక్ష క్రమంలో పలువురు అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌కు వచ్చిన సమాచారంతో ఈ రాకెట్‌కు ఛేదించినట్టు పోలీసులు గత నెల 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారిలో టీచర్ తుషార్ భట్, స్కూల్ ప్రిన్సిపాల్ పర్షోత్తం శర్మ, వడోదరకు చెందిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ పరుశురాం రాయ్, అతని సహచరుడు విభోర్ ఆనంద్, మధ్యవర్తి ఆరిఫ్ వోహ్రా ఉన్నారు.
Also read: కువైట్ మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం