Andhra Pradesh : కాకినాడ ఉప్పాడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. మత్స్యకారుల ఆందోళన

కాకినాడ జిల్లాలో ఉప్పాడ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరబిందో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. తమ కంపెనీ కోసం అరబిందో సముద్రంలో పైన్‌లైన్ వేసింది. దీన్ని వెంటనే తొలగించాలంటూ మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు.

Andhra Pradesh : కాకినాడ ఉప్పాడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. మత్స్యకారుల ఆందోళన
New Update

Fisherman Dharna : కాకినాడ(Kakinada) లో మత్స్యకారులు(Fisherman) మహోగ్రరూపం చూపిస్తున్నారు. ఉప్పాడ దగ్గర ఉన్న అరబిందో ఫార్మసీ కంపెనీ(Aurobindo Pharmacy Company) కి వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహిస్తున్నారు. దీంతో యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో టెన్షన్‌ నెలకొంది. తమ బోట్లకు నిప్పంటించి మరీ మత్స్యకారులు నిరసన తెలుపుతున్నారు. సముద్రంలో వేసిన అరబిందో పైప్‌లైన్‌ను వెంటనే తొలగించాలంటూ ధర్నా చేస్తున్నారు. మూడు రోజులు నుంచి ఆందోళన చేస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈరోజు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. అరబిందో పైప్‌లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగు అవుతుందని వారు అంటున్నారు. వెంటనే పైప్‌లైన్ తొలగించాలని కొంతమంది మత్స్యకారులు ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నారు.

రంగంలోకి పోలీసులు..

మత్స్యకారుల ఆందోళనతో ఉప్పాడ(Uppada) గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోట్లు తగలెట్టడం, ఒంటి మీద కిరోసిన్ పోసుకోవడం వటంఇవి చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండా చ్యలు తీసుకుంటున్నారు. మత్స్యకారులను అదుపు చేసేందుకు పోలీసు బలగాలను దించారు. బ్యానర్లతో పెద్ద సంఖ్యలో చేరుకున్న మత్స్యకారులు ఆదంఓళన చేస్తున్నారు.

మత్స్య సంపద కనుమరుగు...

అరబిందో ఉప్పాడ దగ్గర సముద్రంలోకి పైప్‌లైన్లను వేసింది. తన కంపెనీ నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధాలను ఈ పైన్‌ లైన్ల ద్వారా సముద్రంలోకి పంపిస్తోంది. వీటివలన సముద్రంలో నీరు అంతా కలుషితమయిపోతోంది. దీంతో అక్కడ సముద్రంలో ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి. మత్స్య సంపద కనుమరుగు అయిపోతోంది. ఉప్పాడ తీరంలో చేపల వేటను ఆధారంగా చేసుకుని చాలా మంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఇప్పుడు వారి జీవనోపాధికే భంగం కలిగే ఆపద వాటిల్లింది. అందుకే మత్స్యకారులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇంతకు ముందే దీని గురించి అధికారులకు చెప్పినా పట్టంచుకోలేదు. నేతలతో మొరపెట్టుకున్న పని జరగలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ధర్నా చేస్తున్నామని తెలిపారు. సుమారు వెయ్యి మంది మత్స్యకారులు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు.

Also Read : Cricket : చెలరేగిన భారత బ్యాటర్లు..రోహిత్, గిల్ సెంచరీలు

#andhra-pradesh #kakinada #fisherman #uppada #arabindo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe