Fisherman Missing in Sea: కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ(Uppada) సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు(Fisherman) ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీకి చెందిన మత్స్యకారుడు వంకా కృష్ణారావుగా గుర్తించారు. సోమవారం తొమ్మిది మంది మత్స్యకారులు బోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే, వల లాగుతున్న సమయంలో అనుకోకుండా వల కాలికి తగిలి సముద్రంలోకి జారి పడ్డాడు కృష్ణారావు. వెంటనే తోటి మత్స్యకారులు గాలించినప్పటికీ జారిపడిన వ్యక్తి జాడ దొరకలేదు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు గాలిపంఉ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే గల్లంతైన యువకుడిని గాలించేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. బాధిత కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే పెండెం. కాగా, గల్లంతైన వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణారావు గల్లంతు వార్తతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు.
అమ్మమ్మ ఇంటికి సెలవులకు వచ్చి..
గోదావరి నదిలో విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సాధనాల సాయి అనే విద్యార్థి దసరా సెలవుల సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఐదుగురు యువకులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి నదికి వెళ్లారు. దసరా పండుగ ఓ ఇంట విషాదం నింపింది. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి ప్రాణాలు పోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.
సరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చి గోదావరి నదిలో విద్యార్థి గల్లంతైయ్యాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం కే. ఏనుగుపల్లిలో చోటుచేసుకుంది. కె.ఏనుగుపల్లి బాడవ వద్ద గోదావరిలోకి స్నానానికి ఐదుగురు యువకులు కలిసి దిగిన్నారు. వీరిలో ఒకరు గల్లంతు కాగా.. నలుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం సాయంత్రం సరదాగా గోదావరి నది వద్దకు వెళ్లి గోదావరిలో యువకులు స్నానం చేశారు. ఇంతలో అమలాపురంకు చెందిన సాధనాల సాయి (15) గల్లంతైయ్యాడు. సాయి కోసం రాత్రి గాలింపు చర్యలు చేపట్టగా విద్యార్థి మృతదేహం దొరకలేదు. ఉదయం కూడా గల్లంతైన విద్యార్థి కోసం రెవెన్యూ, పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:
అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..
మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..