Vijay: ‘విజిల్ పోడు’ అంటున్న దళపతి.. ‘గోట్’ నుంచి అదిరిపోయే ఫ‌స్ట్ సింగిల్!

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT) నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఫుల్ మాస్ బీట్ తో సాగే 'విజిల్ పోడు' అనే సాంగ్ స్వయంగా విజయ్ పాడడం విశేషం. యువన్ శంకర్ రాజా సంగీతానికి అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు.

Vijay: ‘విజిల్ పోడు’ అంటున్న దళపతి.. ‘గోట్’ నుంచి అదిరిపోయే ఫ‌స్ట్ సింగిల్!
New Update

GOAT: స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT) నుంచి రెండు బిగ్ అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఇటీవలే సినిమానుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేయగా తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

ఫుల్ మాస్ బీట్..

ఈ మేరకు ఫుల్ మాస్ బీట్ తో సాగే 'విజిల్ పోడు' అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట‌ను స్వయంగా విజయ్ పాడడం విశేషం. మధన్ కార్కి సాహిత్యం, యువన్ శంకర్ రాజా సంగీతానికి అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌, మీనాక్షి చౌదరి, వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో కనిపించనున్నారు. ఇక సినిమాను సెప్టెంబ‌ర్ సెప్టెంబ‌ర్ 05న వ‌రల్డ్ వైడ్‌గా విడుద‌ల చేయ‌నున్నట్లు మేక‌ర్స్ తెలిపారు. ఇక ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ర‌ష్యాలో జ‌రుపుకుంటుంది. ర‌ష్యాలో విజ‌య‌పై యాక్షన్ సీన్స్‌ను చిత్రీక‌రిస్తున్నట్లు మేక‌ర్స్ వెల్లడించారు.

#goat #thalapathy-vijay
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe